భారత మహిళా స్ప్రింటర్ ద్యూతీ చంద్, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌లకు టోక్యో ఒలింపిక్స్ పాల్గొనేందుకు క్వాలిఫై అయ్యారు. వరల్డ్ స్విమ్మింగ్స్ గవర్నింగ్ బాడీ(FINA) బుధవారం దీనికి సంబందించిన ప్రకటించింది. 100మీటర్ల బ్యాక్‌స్టోక్‌లో 'ఏ' స్టాండర్డ్ ప్రమాణాలను అందుకోవడంతో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేస్తున్నట్లు భారత స్విమ్మింగ్ సమాఖ్యకు తెలిపింది. ఇక మహిళా స్ప్రింటర్ ద్యూతీ చంద్ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ ఆధారంగా 100మీటర్లు..200మీటర్ల పరుగులో ఒలింపిక్ కోటా దక్కించుకుంది. 100మీ. పరుగులో ద్యూతీ కెరీర్ బెస్ట్ 11.17సెకన్లు. 200మీటర్ల పరుగులో 23.00సెకన్లుగా ఉంది.

